Saturday, May 18, 2024
- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ కోసం రోజాకు వర్మ ఆఫర్.. రోజా ఏమన్నదంటే ?

- Advertisement -

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మంచి మంచి సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టాడు. అలానే కథ కథనం లేని సినిమాలు తీసి అట్టర్ ప్లాప్ అయ్యాడు. కానీ వర్మ ఏం చేసిన అదోక సంచలనం అవుతోంది. తాజాగా ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీయాలనుకున్నాడు. ఇప్పుడు ఇదే విషయంపై సోషల్ మీడియాలో వార్తలు సంచలనం అవుతున్నాయి.

ఈ లక్శీస్ ఎన్టీఆర్ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకి తీసుకెళ్లి.. అక్టోబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తామని ఇప్పటికే వర్మ ప్రకటించేశాడు. వర్మ ఏ పార్టీకి మద్దతివ్వడం లేదు అని చెప్తునే వైసీపీ ఎమ్మెల్యేలతో స్నేహం మొదలు పెట్టేశాడు వర్మ. ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ జీవితంలోని ఒక భాగం మాత్రమే అని.. లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించింది మొదలు.. ఆ తర్వాత ఏం జరిగినది అనే సంఘటనలతో సినిమా తెరకెక్కుతుందని ఆయన వర్మ తెలిపాడు. ఇక నిర్మాత రాకేష్ రెడ్డి కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రాజకీయాలతో సంబంధం ఉండదని.. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టి సినిమా తీస్తామని చెబుతున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా జరగలేదని చెప్పిన వర్మ వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజా కు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర నటించనుందని తెలిపాడు. మరి రోజా పేరు చెప్పగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో రోజా పాత్ర మీద జనాల్లో క్యూరియాసిటీ స్టార్ట్ అయింది.

అయితే ఎమ్యెల్యే రోజా మాత్రం వర్మ గారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి.. రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదని చెపితే.. వర్మగారు ఆ సినిమాలో తనకి మంచి రోల్ ఇస్తే తప్పక చేస్తానని చెబుతుంది. అయితే వర్మ ఏ పాత్ర తనకు ఇస్తారో ఇంకా తెలిపలేదని.. తెలిసాక మిగిత వివరాలు తెలుపుతానని ఆమె తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న రోజా ఈ మధ్య ఎటువంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఇలాంటి సమయంలో రోజాకు వర్మ సినిమాలో అవకాశం రావడంతో ఆమె కూడా నటించడానికి రెడీ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -