Thursday, May 16, 2024
- Advertisement -

రేణు దేశాయ్ రెండో పెళ్లి పై పవన్ ఏమన్నారంటే..?

- Advertisement -

పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ బద్రి సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు తర్వాత వారు విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ఏడాది క్రితం వరకు తనకు పెళ్లి ఆలోచన లేదన్నారు. కానీ తాను అనారోగ్యానికి గురైనప్పుడు తనకంటూ ఒకరు ఉంటే బాగుంటుందనిపిస్తోందంటున్నారు.

తనను ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి విషయాల్లో మన అనే తోడు ఉంటే బాగుండు అనిపించిందన్నారు. కానీ ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ఆలోచన మారుతోంది. చూద్దాం. ఏదైనా రాసుంటే.. ఎందుకంటే మనకు తెలీదు కదా.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ప్రస్తుతానికి ఎవరూ లేరు. దేవుడు ఎవరినైనా పంపిస్తే చూద్దాం. అంటూ తన మనసులోని బాధను, భావాన్ని వ్యక్తం చేశారు రేణూ దేశాయ్. ఈ విషయం పవన్ కళ్యాన్ తన సన్నిహితుల వద్ద స్పందించారని తెలుస్తోంది. ఆమె అభిప్రాయాలను నేను గౌరవిస్తాను, ఆమె ఎం చేయాలనుకున్నా అది ఆమె వ్యక్తిగత విషయం అంటూ.. స్పందించారట. రేణు దేశాయ్… ఈ మధ్య కొత్తగా మా టీవీలో వచ్చే నీతోనే డాన్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వచ్చేసింది. ఒకప్పటి ఉత్సాహం లేకపోయినా నిండుగా, హుందాతనంతో వ్యవహరిస్తూ.. ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తోంది.

రేణుదేశాయ్ పవన్ నుంచి విడిపోయినా… ఇంకా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను వదల్లేదు. ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించింది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ప్రసార మాధ్యమాలను వేదిక చేసుకుని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే… మీడియా ముందుకు రాకు అని ఒకింత గట్టిగానే చెబుతున్నారు. విడాకుల తర్వాత ఓ స్త్రీ ప్రైవేట్ జీవితం గురించి అడిగే హక్కు భర్తకే లేదు. మరి ఫ్యాన్స్ కు ఎలా ఉంటుంది….అంటూ ఆమెను సపోర్టు చేసే నెటిజెన్లు కూడా బాగానే ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -