ఏ మూహార్తనా బిగ్‌బాస్ రెండో సీజన్ మొదలైందో తెలియదు కాని ,వరుస వివాదాలతో సోషల్‌మీడియాలో తెగ హల్ చల్ చేశారు. బిగ్‌బాస్ రెండో సీజన్ మొత్తం కౌశల్ చూట్టునే తిరిగింది. బిగ్‌బాస్ విన్నర్‌గా కౌశల్ నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కౌశల్ విన్నర్‌గా నిలవడానికి కొందరు వ్యతిరేకించారు హౌస్‌మెట్స్ కూడా. తాజాగా మరోసారి బిగ్‌బాస్ ఇంటి సభ్యులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రోల్ రైడా కొత్తగా ఓ పాటను ర్యాంపు చేశాడు. ఇటీవల కాలంలో రాదు అనే పదం బాగా ఫేమస్ అయింది.
దీనిని బేస్ చేసుకుని ఓ సాంగ్‌ను రూపొందించాడు రోల్ రైడా. ఈ సాంగ్‌లో ఓ చోట ”ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తదా” అంటూ లిరిక్ ఉంది. ఈ పదాన్ని కౌశల్‌ను ఉద్దేశించి పెట్టిందని కౌశల్ ఆర్మీ ఆరోపిస్తున్నారు. దీంతో కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో రోల్ రైడాను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆ వీడియోకి అత్యధిక సంఖ్యలో డిస్ లైకులు కొడుతూనే ఉన్నారు. ఈ విషయంపై స్పందించిన రోల్ రైడా.. కౌశల్ ఆర్మీకి క్షమాపణలు చెప్పారు. నిజానికి అది నేను కౌశల్ ఉద్దేశించి చేసిన కామెంట్ కాదని చెప్పుకొచ్చాడు రోల్ రైడా.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ