Sunday, April 28, 2024
- Advertisement -

చంచల్ గూడ జైల్ రెడీ.. జగన్ పై విచారణ సాధ్యమేనా ?

- Advertisement -

ఏపీలో గత ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎంతటి సంచలనం రేకెత్తించ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ హత్యకు సంబంధించి ఇప్పటివరకు దొషులు ఎవరనేది మిస్టరీగానే ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, కేసు ని సీబీఐకి అప్పగించాలని బలంగా డిమాండ్ చేశారు. కట్ చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా బాబాయ్ హత్యకు సంబంధించి దొషులు ఎవరనేది ఇంక బయట పడకపోవడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్న సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, సాక్షులను బెదిరిస్తున్నారని, బెదిరించే వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఏకంగా సీబీఐ అధికారులే దర్మాసనం ముందు వాపోయారు.

దీంతో ఈ కేసు దర్యాప్తును పక్కా రాష్ట్రనికి బదలి చేసింది దర్మాసనం. ఇక ఇటీవల తెలంగాణ సీబీఐకి ఈ కేసు అప్పగించినట్లు సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. దాంతో ఈ కేసు వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉందనే విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ కేసు తెలంగాణకు బదలి కావడాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్ష టీడీపీ అయితే సెటైర్ల వర్షం కురిపిస్తోంది.. బాబాయ్ ని హత్య చేసింది అబ్బాయేనని నారా లోకేశ్ ఆరోపించారు. ఈ కేసు పక్క రాష్ట్రనికి వెళ్లినందున అబ్బాయ్ చెంచల్ గూడ జైల్ కు వెళ్ళడం ఖాయమని ఎద్దేవా చేశారు లోకేశ్. అయితే వివేకా హత్య కేసులో జగన్ పాత్ర ఉండని మొదటి నుంచి టీడీపీ ఆరోపిస్తూనే ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేసు ముందుకు సాగకపోవడంతో జగన్ పాత్ర ఉందనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.

వివేకా హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని వివేకా కూతురు సునీత రెడ్డి ఒంటరిగానే పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ” ఏపీలో న్యాయం జరగదనే సుప్రీం కోర్టు తెలంగాణకు బదలి చేసిందని, ఇప్పుడు ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని రఘురామ వ్యాఖ్యానించారు. బాబాయ్ కేసు పక్క రాష్ట్రనికి వెళ్లినందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు. ఈ కేసు లో నిజాలు బయటకు రావాలంటే సి‌ఎం జగన్ ను తెలంగాణ సీబీఐ విచారించాలని అప్పుడే అన్నీ నిజాలు బయటకు వస్తాయని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి వివేకా హత్య కేసు తెలంగాణకు చేరడంతో ఏపీ ప్రభుత్వంలో కలవరం మొదలైందనే చెప్పాలి. మరి తెలంగాణ సీబీఐ అయిన ఈ కేసులో పురోగతి సాధిస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఏపీలో మోడీ దోస్తీ ఎవరితో.. లైన్లో ముగ్గురు అధినేతలు !

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా?

షర్మిల అరెస్టుల మీద అరెస్టులు.. ఆమెకు లాభమే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -