Friday, March 29, 2024
- Advertisement -

గర్జించిన రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్..!

- Advertisement -

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించడమే కాదు.. దానిని ప్రేక్షకుల చెంతకు తీసుకెళ్లడం లోనూ ఆయనది ప్రత్యేక శైలి. ఆయన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ల కోసం కూడా అభిమానులు ఎదురు చూస్తారంటే ప్రమోషన్ల తోనే ఆయన అభిమానులను ఎంత మెప్పిస్తాడో అర్థమవుతుంది. మగధీర, బాహుబలి సినిమాలు వంటి సినిమాలు అంతలా విజయం సాధించాయంటే అందులోని కంటెంట్ ఒక్కటే కాదు.. రాజమౌళి చేపట్టిన ప్రమోషన్స్ కూడా ఒక కారణం.

బాహుబలి విడుదలకు ముందు విడుదల చేసిన మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ వీడియో తో ముందుకు వచ్చాడు. ఈ వీడియో బాహుబలి మేకింగ్ వీడియో కంటే అద్భుతంగా ఉంది. ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్లో ఉండబోతుందో మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. కళ్ళు చెదిరే సెట్టింగులు అబ్బుర పరుస్తాయి. గాలిలో ఎగురుతూ బాణాలు సంధిస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ తన కత్తిని గాలిలో ఎగురుతూ పట్టుకోవడం గూస్ బంప్స్ తెప్పించేలా వున్నాయి.

అలాగే అజయ్ దేవగణ్, శ్రీయ, అలియా భట్, ఒలీవియా, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో పోషించే పాత్ర లను చూడొచ్చు. బాహుబలి సినిమా కు ఏ మాత్రం తగ్గని భారీతనం ఈ మేకింగ్ వీడియోలో కనిపిస్తుంది. ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు ఉన్నాయో, వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను రూపొందించినట్లు ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల అవుతుందా..కాదా.. అని సందేహాలు నెలకొన్నాయి. కానీ మరోసారి మేకింగ్ వీడియోలో కూడా అక్టోబర్ 13న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -