టీమిండియాకు షాక్.. ఇద్దరు ఆటగాళ్లకు పాజిటివ్?

- Advertisement -

ఇంగ్లాండ్లో సుదీర్ఘ పర్యటనకు టీమిండియా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్ తో టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో తలపడింది. ఇందులో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ పూర్తయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టుతో భారత్ టెస్ట్, వన్డే సిరీస్ లు ఆడాల్సి ఉంది. అయితే ఆ సిరీస్ ప్రారంభానికి చాలా సమయం ఉండడంతో ఆటగాళ్లకు కరోనా నిబంధనల పట్ల సడలింపు ఇచ్చారు. ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి రిలీఫ్ పొందడానికి ఇచ్చిన ఈ సడలింపులే ఇప్పుడు కొంప ముంచాయి.

ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ లోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. షాపింగ్,హోటల్స్ కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు కరోనా సోకినట్లు సమాచారం. వారిలో ఒకరు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కాగా.. మరొకరు ఎవరో తెలియాల్సి ఉంది. కొద్ది రోజుల కిందట పంత్ వెంబ్లే స్టేడియం పరిసరాల్లో తన స్నేహితులను కలిసినట్లు సమాచారం. వారి ద్వారానే పంత్ పాజిటివ్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూకేలో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. పంత్ తో పాటు మరొక ఆటగాడికి కూడా కరోనా రావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది.

- Advertisement -

వారి ద్వారా మరికొంత మంది ఆటగాళ్లకు ఏమైనా వైరస్ సోకిందేమోనని భయపడుతున్నారు. టీమిండియా మరో జట్టు శ్రీలంక లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా శ్రీలంక జట్టులోని సిబ్బందికి వైరస్ సోకడంతో మ్యాచ్ ల నిర్వహణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న జట్టులోని ఆటగాళ్లు పాజిటివ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే పంత్ మరొక ఆటగాడికి కోవిడ్ సోకినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -