Tuesday, May 6, 2025
- Advertisement -

దుమ్మురేపుతున్న నాటు సాంగ్

- Advertisement -

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ ఏడాది జనవరి 7న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక సినిమాలోని పాటలకైతే మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యన్టీఆర్, రామ్ చరణ్ నాటు స్టెప్పులతో దుమ్మురేపేసిన నాటు నాటు సాంగ్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కింది. ఈ పాటను అనుకరిస్తూ చాలా మంది తమ స్టైల్లో స్టెప్‌లు వేశారు. ఈ పాట యూట్యూబ్‌లో అయితే రికార్డు వ్యూస్ దక్కించుకొంది. ఈ పాట ఇప్పటివరకు 200 మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

సంగీత దర్శకుడు కీరవాణి క్యాచీ ట్యూన్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ పాట అన్ని భాషల్లోనూ కలుపుకొని 200 మిలియన్ క్లబ్ లోకి చేరుకోవడం అభిమానుల్ని ఆనందపరుస్తోంది. మరి సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

మహేశ్ బాబు అభిమానుల్లో కొత్త భయాలు.. వారి అనుమానాలు నిజమవుతాయా ?

సినిమాలో రానా కనిపించలేదన్న డైరెక్టర్

భీమ్లానాయక్ సినిమా ఎలా ఉందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -