జీవక్రియలను పెంపొందించుకోవాలా.. అయితే ఈ ఆకుకూరలు మంచివి?

- Advertisement -

మన శరీరంలోని వివిధ అవయవాలు జీవక్రియలను నిర్వహించాలంటే మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఎన్నో పోషక విలువలు ఉండాలి.ఈ విధంగా మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉన్నప్పుడే మన శరీరంలోని ప్రతి అవయవం సరైన క్రమంలో పనిచేస్తుంది అప్పుడే మనం ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలము. అయితే మన శరీరంలో జీవక్రియలను పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా మన ఆహారంలో ఆకుకూరలు ఉండాల్సిందే. మరి ఆకుకూరలు ఏమిటో తెలుసుకుందాం..

తోటకూర: తోటకూరలో ఎన్నో విలువైన పోషకాలు,విటమిన్‌ ‘ఎ’, ‘కె’, ‘బి6’, ‘సి’తోపాటు రిబోఫ్లేవిన్‌, ఫోలేట్‌, ఐరన్, మెగ్నీషియం, పోటాషియం ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి తోటకూర ఒక వరమని చెప్పవచ్చు.

- Advertisement -

బచ్చలి కూర: బచ్చలి కూరలో అధికంగా క్యాల్షియం,ఐరన్, సోడియం, జింక్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించి మెదడును చురుకుగా పని చేయడంలో దోహదపడుతుంది.

Also read:అంత వంగకు అనసూయ… అనసూయ డ్రెస్ పై కామెంట్స్ చేసిన సుమ?

మెంతికూర: జింక్, పోలిక్ యాసిడ్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే మెంతికూరను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియాలతో పోరాడి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అదేవిధంగా జుట్టు ఒత్తుగా పెరగడానికి జింక్ కీలక పాత్ర పోషిస్తుంది.

పుదీనా ఆకులు: పుదీనా ఆకులో ఎన్నో దివ్యమైన ఔషుధ గుణాలు దాగి ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి యాంటీఇన్ఫ్లమేటరీ,యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి కాపాడటానికి దోహదపడతాయి.అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పుదీనా ఆకులు కీలకపాత్ర పోషిస్తాయి.

Also read:ఆచార్య నుంచి మరో సర్ప్రైస్.. ఈసారి చెర్రీ వంతు?

గోంగూర: ఐరన్ పుష్కలంగా లభించే వాటిలో గోంగూర మొదటి స్థానంలో ఉంటుంది. గోంగూర తరచూ తినడం వల్ల ఐరన్ మన శరీరానికి అంది రక్తం అభివృద్ధికి దోహదపడుతుంది. అదేవిధంగా ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంపొందింపజేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -