Tuesday, May 7, 2024
- Advertisement -

ఆగిపోయిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌..

- Advertisement -

మెగా అభిమానుల‌కు చేదువార్త‌. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణేలో జరుగుతోంది. పుణేలో షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండ‌గా దురదృష్టవశాత్తు రామ్ చరణ్ గాయపడ్డారు. మంగళవారం ఆయన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా కాలి చీలమండకు స్వల్ప గాయమైంది. దీంతో సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది.చరణ్‌ గాయం కారణంగా షూటింగ్ వాయిదా వేస్తున్నట్టుగా తెలిపిన చిత్రయూనిట్ మూడు వారాల తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియజేశారు.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ట్విట్టర్‌లో కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -