Friday, May 3, 2024
- Advertisement -

జనసేన పార్టీ ఫండ్ పై నాగ బాబు కామెంట్స్

- Advertisement -

నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన నాగబాబు ఈ మధ్య సినిమాలకి దూరంగా వివాదాలకి దగ్గరగా ఉంటున్నారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అవసరమైన పరిస్థితుల్లో జనసేనానికి అభిమానులు తోడుగా నిలబడ్డారు అని ఆ అభిమానులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. జనసేన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు 100 కోట్ల దాకా పార్టీ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు.

అది చూసిన తాను చాలా ఆశ్చర్యపోయాను అని నాగబాబు అన్నారు. ఫాన్స్ ఆర్గనైజేషన్స్ తమ తాహతుకు తగ్గట్టుగా 10 నుంచి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు డొనేట్ చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ మరి ఏ జనసేన లీడర్ కానీ డొనేషన్లు కోసం అడగలేదని కానీ అభిమానులు స్వతహాగా పార్టీ ఫండ్ డొనేట్ చేయడానికి తరలి వచ్చారని ఆయన పేర్కొన్నారు. అభిమానులు ఈ ఫండ్ ని కలెక్ట్ చేసి జనసేనానికి మద్దతు పలకాలని ఆశిస్తున్నారని, వాళ్ళు ఆ గోల్ రీచ్ అయినా అవ్వకపోయినా ఆ కమిట్మెంట్ చాలా గొప్పదని ఆయన తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -