Saturday, May 4, 2024
- Advertisement -

ధోని రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ…

- Advertisement -

విండీస్ గడ్డపై కోహ్లీసేన టెస్ట్ సిరీస్ ను 2-0 తో క్లీన్ స్విప్ చేసింది. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకన్న కోహ్లీ కెప్టెన్ గా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. జమైకా వేదికగా వెస్టిండీస్‌తో సోమవారం రాత్రి ముగిసిన రెండో టెస్టులో టీమిండియాని గెలిపించిన విరాట్ కోహ్లి.. టెస్టుల్లో భారత్ జట్టుకి ఎక్కువ విజయాల్ని అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ధోని పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది.

మొత్తంగా 48 టెస్టులకు సారథ్యం వహించిన ఈ రన్‌ మెషీన్‌ 28 విజయాలతో ధోని రికార్డును అధిగమించాడు. తద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ల అందరికంటే ఎక్కువ విజయాలు సాధించిన సారథిగా చరిత్రకెక్కాడు.ప్పటి వరకూ 27 విజయాలతో ధోనీ అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా జమైకా టెస్టు గెలుపుతో అతడ్ని వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ 28వ విజయంతో నెం.1 స్థానానికి ఎగబాకాడు.

సుదీర్ఘ కెరీర్‌లో మహేంద్రసింగ్ ధోనీ 60 టెస్టులకి కెప్టెన్సీ వహించగా.. ఇందులో 27 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ జట్టు.. 18 టెస్టుల్లో ఓడి, 15 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 48 టెస్టులాడిన టీమిండియా.. 28 విజయాలు, 10 ఓటముల, 10 డ్రాలతో నిలిచింది. ధోనీ కెప్టెన్సీలో భారత్ 45% విజయాల్ని నమోదు చేయగా.. కోహ్లీ నాయకత్వంలో 58.33% టెస్టుల్లో గెలుపొందింది.

ప్రస్తుతం ఓవరాల్‌గా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్ల జాబితాలో స్టీవ్‌ వా(36), రికీ పాంటింగ్‌(33) తర్వాత కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో భారత్‌కి ఎక్కువ విజయాల్ని అందించిన కెప్టెన్ల జాబితా విషయానికి వస్తే విరాట్ కోహ్లి (28), మహేంద్రసింగ్ ధోని (27) ధోనీ తర్వాత వరుసగా సౌరవ్ గంగూలీ (21), మహ్మద్ అజహరుద్దీన్ (14), పటౌడి (7), సునీల్ గవాస్కర్ (9) టాప్-6లో కొనసాగుతున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -