Sunday, May 4, 2025
- Advertisement -

రవితేజ 75..శ్రీలీలతో!

- Advertisement -

భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా 75వ సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ప్రొడక్షన్ నంబర్ 28 గా ఈ సినిమా వస్తుండగా భాను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా రవితేజ-శ్రీలీల జోడిగా వచ్చిన ధమాకా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

భాను కథ-కథనం అందించిన ఈ చిత్రానికి నందు సవిరిగాన మాటలు అందిస్తుండగా ఇవాళ ఉదయం 07:29 గంటలకు పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ్టి నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -