Sunday, April 28, 2024
- Advertisement -

సొంత పార్టీనీ, ప్రభుత్వాన్నీ ఇరుకున పెడుతున్న కెసిఆర్

- Advertisement -

మంచి చదువరిగా, తెలంగాణా రాష్ట్రం అవతరించిన వెంటనే సరైన నాయకుడు పాలించడానికి రంగం లోకి దిగాడు అనిపించుకునే విధంగా కెసిఆర్ తన పాలనా శైలి చేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ బలపడాల్సిన ప్రభుత్వ వ్యవహరా శైలి తమని తామీ గోతిలో దింపుకునే విధంగా ఉంది అన్నటు ప్రవర్తిస్తున్నారు. అసంబ్లీ లో చొక్కా పట్టుకుని మరీ ప్రశ్నించే విపక్షాలని ఎలా ఎదురుకోవాలి అనే విషయం లో ఒక్కొక్కరూ ఒక్కొక్క పంథా పాటిస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరైతే ఎక్కువగా తర్కంగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటారో వారిని సస్పెండ్ చెయ్యడానికి ఆసక్తి చూపుతారు. 

లేదా మరి కొంత మంది గ్రూప్ సభ్యులని సస్పెండ్ చెయ్యడానికి చూస్తారు కానీ తెలంగాణా అసంబ్లీ లో మొన్న జరిగిన శీతాకాల సమావేశాల్లో విపక్షం అనేది అసంబ్లీ లో లేకుండా చాపచుట్టేసినట్టు అసంబ్లీ ని చుట్టేసే పనిలో పడ్డ కెసిఆర్ సర్కారు పార్టీ మొత్తాన్నీ సస్పెండ్ చేసి పారేసింది. 

అదే అదనుగా తీసుకుని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కట్టకట్టుకుని తలొక జిల్లా పంచుకుని ప్రజలలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి చర్యలు జరిగినపుడు ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంటుంది. తెలంగాణా సర్కారుకి ఈ విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. అధికారం చేపట్టిన దగ్గర నుంచీ ప్రజాస్వామ్యం లాగా కాకుండా రాచరిక పాలన అన్నట్టు కెసిఆర్ వ్యవహరించారు అనేది ఇప్పటికీ ఉన్న బలమైన వాదన. తెరాస అధికారం చేపట్టడం ఆలస్యం తాను తప్ప తెలంగాణా లో ఏదీ లేదు అన్నట్టు ఆ పార్టీ వ్యవహారశైలి నడుస్తోంది , ప్రతిపక్షాల వాదన ని వీసవేత్తు కూడా పరిగణ లోకి తీసుకోకునా ప్రతిపక్షాలు అనేవి లేకుండా చెయ్యాలనే కంకణం తో సాగుతోంది కథ. ఇదే తీరును అసెంబ్లీలోనూ కొనసాగిస్తోంది. 

రేవంత్ రెడ్డిని మాట్లాడకుండా చేసినట్లు.. మొత్తం ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని భావిస్తోంది. రేవంత్ రెడ్డిని మాట్లాడకుండా చేసినప్పుడు మిగిలిన ప్రతిపక్ష నాయకులు కూడా పెద్దగా స్పందించలేదు. మరి మొత్తం పార్టీ పార్టీ నే సస్పెన్షన్ కి గురి చేస్తే సైలెంట్ గా ఎలా ఉంటారు? అంతా కలిసి ప్రజలలోకి చక్కా పోయారు. 

ఈ విధమైన అదను కెసిఆర్ సర్కారు ఇచ్చింది పైగా అప్రతిష్ట కూడా మూట గట్టుకుంది. ఇలాంటి పరిస్థితి లో కెసిఆర్ ఈ విషయం మీద స్పందించి తాను ప్రాణం ఉండగా తప్పు చేయనని ప్రతిపక్షాలను తాము గెంటేయలేదని అవే గెంటించుకుని పోయాయని చెబుతున్నారు. అయితే ఉద్యమ సమయంలో ఆయన ఇవే మాటలు చెప్పినప్పుడు ప్రజలతోపాటు ప్రతిపక్షాలు కూడా విశ్వసించాయి . ఇప్పటికీ ఆయన్ని ఎంత మంది నమ్ముతున్నారు అనేది భారీ ప్రశ్న. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -