Saturday, April 20, 2024
- Advertisement -

చిరంజీవి పై అనూహ్యమైన పుకార్లు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన కొత్త లుక్ ని ప్రపంచానికి పరిచయం చేశారు. సై రా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ టైం కి ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి లో చాలా మార్పులు వచ్చాయి అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి ఈ కొత్త లుక్ కోసం చాలా బాగా కష్టపడ్డారు అని తెలుస్తుంది. ఒక డైట్ ఎక్స్పర్ట్ తో కలిసి ఎంతో కష్టపడి చిరంజీవి ఈ కొత్త లుక్ ని అనుసరించారు. కాకపోతే చిరంజీవి కి సంబందించిన నూతన ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి ఇండస్ట్రీ లో చాలా రూమర్స్ వస్తున్నాయి. ఎంతలా అంటే, చిరంజీవి అస్సలు వ్యాయామాలు ఏమి చేయలేదని, అంతా సర్జరీ చేయించుకొని మానేజ్ చేశారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

అతి తక్కవ టైం లో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అస్సలు సాధ్యమయ్యే పరిస్థితి లేదని, కానీ చిరంజీవి ఇది ఎలా సాధించాడు అనే విషయం లో మాత్రం క్లారిటీ లేదని కొందరు అంటున్నారు. కాకపోతే కీటో డైట్ ని చిరంజీవి అనుసరించారని, అది ప్రాపర్ గా చేస్తే తక్కువ టైం లో నే ఫలితాలు వస్తాయి అని కొందరు అంటున్నారు. ఈ వయసు లో చిరంజీవి సర్జరీ వైపు మొగ్గు చూపి ఉండరు అనేది మాత్రం కచ్చితంగా చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -