గౌతమ్ మీనన్ సినిమా కి మోక్షం రానుందా?

- Advertisement -

ఎన్నై నూకి పాయం తోట అనే సినిమా మేఘ ఆకాష్ అనే హీరోయిన్ కి మొదటి సినిమా. కానీ ఈ సినిమా విడుదల కాకా ముందు నుంచే మేఘ కి అవకాశాలు రావడం అలా తెలుగు లో తమిళం లో ఇతర సినిమాలు చేయడం జరిగిపోయింది. ఇకపోతే ఈ సినిమా కి దర్శకుడు గౌతమ్ మీనన్. ధనుష్ హీరో.ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ ఎందుకో, చాలా కారణాల వలన ఏది సరిగా ముందుకు సాగడం లేదు.

ఇకపోతే ఈ సినిమా కి ఎట్టకేలకు మోక్షం రానుందని తెలుస్తుంది. దర్శకుడికి నిర్మాతకి ఫైనాన్షియర్స్ కి మధ్య విభేదాలు రావడం తో సినిమా ఆలస్యం అయిందని, ఇప్పుడు సమస్యలన్నీ తొలగిపోయాయి అని వినిపిస్తుంది.

అయితే నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి అని, ఇక సినిమా బయటకు రావడానికి అవసరమైన ఫండ్ ఇంకా సమకూరలేదని, అది కూడా త్వరలో నే రాబోతుందని, ఎలాగైనా ఈ సినిమా ని ఈ ఏడాది లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీ ని త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -