Wednesday, May 1, 2024
- Advertisement -

ప్ర‌భాస్‌కు కుల పిచ్చి?

- Advertisement -

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిల‌ర్ ఎవ‌రంటే అంద‌రు ఠక్కున యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అని అంటారు.నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా,ఇప్పటికీ ఆయన పెళ్లి మాత్రం చేసుకోలేదు. ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణంరాజు ప్ర‌భాస్‌కు పెళ్లి చేస్తామ‌ని ఆ ప‌నిలోనే ఉన్నాము అని చెప్పి కూడా సంవ‌త్సరం దాటిపోయింది.ప్ర‌భాస్ కూడా బాహుబ‌లి సినిమా పూర్తి అవ్వ‌గానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు.బాహుబ‌లి సినిమా పూర్తి చేసి సైలెంట్‌గా మ‌రో సినిమా మొద‌లు పెట్టాడు.

హీరోయిన్ అనుష్క‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్తలు వ‌చ్చిన అవి రూమ‌ర్సే అని కొట్టి పారేస్తున్నారు.ఇక మెగా ఫ్యామిలీ ఇంటి అల్లుడు కాబోతున్నాడు అంటు వార్తలు వ‌చ్చాయి.ప్ర‌భాస్‌కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుతురు నిహారిక‌ను ఇచ్చి వివాహం జ‌రిపిస్తున్నారనే వార్త‌లు రావ‌డంతో,అటు మెగా అభిమానులు,ఇటు ప్ర‌భాస్ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు.ఈలోపే నిహారిక‌కు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేద‌ని మెగా ఫ్యామిలీ తెలిపింది.అయితే అసలు విష‌యం ఏమిటింటే ప్ర‌భాస్‌కు కుల పిచ్చి ఎక్కువ అని తెలుస్తుంది.త‌న కుల అమ్మాయినే పెళ్లి చేసుకుంటాన‌ని త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెప్పాడ‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను పెళ్లి చూపులు చూశార‌ని అవి ప్ర‌భాస్‌కు న‌చ్చ‌లేద‌ని వినికిడి.ప్రభాస్ ఇంట్లో కాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువట. క్షత్రియ వర్గానికి చెందిన ప్రభాస్ ఆ వర్గానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనేది పెద్దల ఆలోచన. ఈ కారణంగానే ప్రభాస్ తను ఇష్టపడిన ఇద్దరు హీరోయిన్లను వదులుకున్నాడని టాక్.ఈ మధ్యకాలంలో హీరోలు కుల, మతాలను అతీతంగా పెళ్లిల్లు చేసుకుంటున్నారు.కాని ప్ర‌భాస్ మాత్రం కుల పిచ్చితో ఇంకా ఊగుతున్నాడ‌ని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో ప్ర‌భాసే చెప్పాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -