ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన పాయల్ రాజ్‌పుత్ ఆ సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చకుంది. ప్రస్తుతం మంచి ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో లిప్‌లాక్, బోల్డ్ పెర్ఫామెన్స్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసింది. అందరి హీరోయిన్‌లలాగానే సోషియల్ మీడియాలో అందాల ఆరబోత మొదలెట్టింది.ప్రస్తుతం పాయల్ బీచ్ ఫోటోలు సోషియల్ మీడియాలో సంచలనంగా మారాయి.
పాయల్ రాజ్ పుత్ బీచ్ లో స్విమ్ డ్రెస్ ధరించి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. బీచ్‌ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్లాక్ స్విమ్ షూట్‌లో తన అందాలతో అదరగొడ్తోంది. ఆర్ఎక్స్ 100 చిత్రం పాయల్ రొమాన్స్‌తో అభిమానులను సంపాదించుకుంది.విఐ ఆనంద్, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది
