Thursday, May 16, 2024
- Advertisement -

ఇక్క‌డ ఎవ‌రు ఎవ్వ‌రికి ఛాన్స్‌లు ఇవ్వ‌రు – ఆర్ఎక్స్ 100 బ్యూటీ

- Advertisement -

ఆర్ఎక్స్ 100 ఒక్క సినిమాతో పాపుల‌ర్ న‌టిగా మారింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాకు ముందు కొన్ని సినిమాల‌లో న‌టించ‌న‌ప్ప‌ట‌కి స‌రైన గుర్తింపు రాలేదు. కాని ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ అందాల‌కు ఫిదా అయింది టాలీవుడ్‌. దీంతో సోషల్ మీడియాలో కూడా ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఫోటోని షేర్ చేసి ‘ఛాన్స్ ఇవ్వనంత వరకు ఎవరూ హర్ట్ చేయరు’ అని రాసింది. దీని అర్థం ఇక్క‌డ ఎవ‌రు ఎవ్వ‌రికి చాన్స్‌లు ఇవ్వ‌రు. ఎవ‌రికి వారే చాన్స్‌లు సంపాదించాలి అని చెప్పుకొచ్చింది.

దీంతో పాయ‌ల్ చేసిన పోస్ట్‌కు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా అదిరిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే పాయల్ రాజ్ పుత్ ఒకేసారి రెండు సినిమాల‌కు సైన్ చేసినట్లు స‌మాచారం. ర‌వితేజ‌,అల్లు అర్జున్ సినిమాల‌లో పాయల్ హీరోయిన్‌గా న‌టిస్తుందని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -