Tuesday, April 30, 2024
- Advertisement -

సన్నాఫ్ సత్యమూర్తి నష్టాలు ఈ స్థాయిలో ఉన్నాయి..!

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సన్నాప్ సత్యూమర్తి సినిమా 50 రోజులను పూర్తి చేసుకొంది. ఇప్పటికే అక్కడ ఈ సినిమా అలా అలా ఆడేస్తోంది. అల్లు అర్జున్ సినిమాలకు సహజంగా ఉండే లాంగ్ రన్ “సన్నాఫ్ సత్యమూర్తి’ కి కలిసొచ్చింది.

ఇప్పుడు విశేషం ఏమిటంటే…మొత్తంఆఈసినిమాకు 2.5 కోట్ల రూపాయల నష్టం వాటిళ్లనుందనేది మ్యాటర్!

విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలుండినాయి. “రేసుగుర్రం’తో  హీరో “అత్తారింటికి దారేదీ’ సినిమాతో దర్శకుడు హిట్స్ తో ఉన్నారు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంంటే అంచనాలు పెరిగిపోయాయి. బారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇదే సమయంలో వచ్చిన నెగిటివ్ టాక్ సినిమాను కొంత వరకూ దెబ్బ కొట్టింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దాదాపు 54 కోట్లకు అమ్మారు.

అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా 51 కోట్ల రూపాయల వరకూ షేర్ ను సాధించింది. దీంతో న దాదాపు రెండు కోట్లరూపాయల నష్టం  తప్పడం లేదు. అయితే ఈ నష్టం నిర్మాతకు కాదని.. డిస్ట్రిబ్యూటర్స్ కేనని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -