మొత్తానికి చంద్బరాబు ఏడాది పాలన పూర్తి అవుతున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు.. ఆ పార్టీ అభిమానులకు చాలా ఊరటే లభించింది. బాబు పాలన మొదలై ఏడాదిగడుస్తున్న నేపథ్యంలో వారు కొంత హ్యాపీగా ఉన్నారు.
మరి బాబు పాలనకుఏడాది పూర్తయితే వైకాపా వాళ్లకు ఏం ఆనందం? అంటే.. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించాలి.
ఒకవైపు రేవంత్ రెడ్డి ఏసీబీ దగ్గర ఇరుక్కుపోయాడు. అతి విశ్వాసంతో ఆయన వేసిన స్టెప్ తో అడ్డంగాబుక్కయ్యాడు. నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయి రేవంత్ రెడ్డి బుక్కయిపోయాడు. మరి తెలుగుదేశం పార్టీ ఇమేజ్ కు ఇది పెద్ద దెబ్బ. ఈ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని ఏ2గా చేర్చాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి.
మరి అదే జరిగితే బాబు ఈ వ్యవహారంలో కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డిపరామర్శించడానికి తెలుగుదేశం నేతలుచర్లపల్లి జైలు చుట్టూ తిరుగుతున్నారు. రేవంత్ ను పరామర్శిస్తూ.. భవిస్యత్తు కార్యాచరణ గురించి వారు స్పందిస్తున్నారు. దీన్ని బట్టి తెలుగుదేశంపార్టీరేవంత్ తీరతో ఎలాంటి అబ్బందులు పడుతోందో అర్థంచేసుకోవచ్చు. మరి వైకాపా అనందించడానికి ఇంతకన్నా ఏం రీజన్ కావాలి?! ఇన్ని రోజులూ తమ అధినేతను అవినీతి పరుడూ అంటూ విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడటానికి.. ఆయనను ఏ2గా విమర్శించడానికి రేవంత్ వ్యవహారం చాలు కదా!
