Tuesday, May 14, 2024
- Advertisement -

సాహో ట్రైలర్ విడుదల అప్పుడే

- Advertisement -

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కాబట్టి ‘సాహో’ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకింగ్ వీడియోలు, టీజర్ మరియు పాటలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకనిర్మాతలు తాజాగా ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 10వ తేదీన ‘సాహో’ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారట.

టీజర్ లాగానే సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మరియు విజువల్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, మందిరా బేడి, నీల్ నితిన్ ముకేష్, కోలీవుడ్ స్టార్ అరుణ్ విజయ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు, నటీనటులు ఈ సినిమా పై భారీ అంచనాలను రోజురోజుకీ పెంచేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -