Monday, April 29, 2024
- Advertisement -

జమ్మూ, కాశ్మర్ లోకి ఉగ్రవాదలు…దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం

- Advertisement -

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలర్డ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జమ్మూ, కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం రద్దు చేసినం సంగతి తెలిసిందే. కశ్మీర్ విభజన, స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈనెల 10 నుంచి 20 వరకు విమానాశ్రయాలలో సందర్శకుల అనుమతిని రద్దు చేస్తూ విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.

అంతే కాకుండా కట్టిదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఆగష్టు 15తో పాటు, కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రుచించని ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో విధ్వంసం చేసేందుకు తీవ్ర వాదలు జమ్మూ,కాశ్మీర్ లోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ తెలపడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎయిర్‌పోర్ట్‌లతో పాటు ప్రధాన నగరాల్లోని కీలక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. దీంతో విమానాశ్రయాల్లో పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. ప్రయాణీకులను అణువణువు తనిఖీలు చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్ అజ్గర్ మంగళవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముంబైలో విధ్వసం సృష్టించేందుకు ప్రణాలికలు రచించినట్లు సమాచారం. కశ్మీర్‌లో మరో పుల్వామా తరహా దాడి జరగొచ్చన్న పాకిస్థాన్ కుట్ర పూరిత వ్యాఖ్యల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -