Saturday, May 11, 2024
- Advertisement -

డివైడ్ టాక్ రావడంతో సాహో టీమ్ కొత్త అస్త్రం

- Advertisement -

సాహో సినిమా అంచనాలలో ఆకాశ హద్దును తాకింది, కానీ రిలీజ్ తరువాత ఫ్యాన్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితి. సాధారణంగా సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు సినిమాను చాలా ప్రొమోట్ చేస్తారు. ఇంటర్వ్యూలు, టాక్ షోలు అంటూ గ్యాప్ లేకుండా ప్రొమోట్ చేస్తారు. చేసిన క్యారెక్టరే చేస్తున్నా కూడా ఇది నా జీవితంలో చెయ్యని క్యారెక్టర్, నన్ను నేను ప్రూవ్ చేసుకున్న క్యారెక్టర్ అంటూ సోది చెప్తారు.

ఎంత కథ బాగున్నా ప్రమోషన్స్ లేక సరిగ్గా ఆడని సినిమాలు కూడా ఉన్నాయి. మూవీ ప్రమోషన్స్ సినిమా సక్సెస్ లో అంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అది మంచి విషయమా కాదా అనేది కొంచెం సేపు పక్కకి పెడితే… మన బాహుబలి కూడా దానికి అతీతుడు ఏం కాదు అని అర్థం అవుతుంది. ప్రభాస్ కూడా ప్రమోషన్స్ మీద ఆధారపడుతున్నాడు అంటేనే వినడానికి విచిత్రంగా ఉన్నా నమ్మకతప్పట్లేదు.

సాహో సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అందుకేనేమో ప్రభాస్ కి ప్రమోషన్స్ పని భుజాన వేసుకోవడం తప్పట్లేదు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్తున్నాడు అంట. సాహో టీమ్ కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ ఇది. ఇంతకుముందు చాలా సినిమాలు బిగ్ బాస్ హౌస్ లో ప్రమోట్ చేస్తే విజయం సాధించాయి, అలాంటి లక్ నే సాహో టీమ్ నమ్ముతోందంట. ఇప్పుడు మీకు ఇందులో ఇంకో గుడ్ అండ్ షాకింగ్ న్యూస్… ప్రభాస్ స్టేజ్ మీద ఉండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కాదు, డెరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోని స్టోర్ రూమ్ ద్వారా లోపలికి వెళుతున్నాడంట, దీనికి సంబంధించిన షూటింగ్ ఈ రోజే పూర్తి అయినట్టు సమాచారం. డార్లింగ్ ఎంత అల్లరి చేస్తాడో మనందరికీ తెలుసు, బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళని ఎలా ఆటపట్టిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -