Tuesday, May 14, 2024
- Advertisement -

సాహో పాటలు అలా ఉండటానికి కారణం అదే!

- Advertisement -

సాహో సినిమా కి ముందు శంకర్ ఎహసాన్ లాక్ సంగీత త్రయం ని తీసుకున్నారు. కానీ చివరి నిమిషం లో వాళ్లకి సరిగా పొసగక మళ్ళీ వేరే వాళ్ళని తీసుకున్నారు. అయితే ఈ సినిమా ని ఆసక్తికరం గా మరల్చడం లో సంగీతం విఫలమయింది అని విషయం మన అందరికీ తెలిసిందే. అయితే పాటల విషయం లో ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

“సాహో సినిమా లో పాటలు మాకు హిందీ భాషలో, కేవలం బాలీవుడ్ ఆడియన్స్ కోసమే కావలి.అందుకే వాటిని తెలుగు లో మళ్ళీ రీ కంపోజ్ చేయించి తెలుగులో లిరిక్స్ రాయించాము. అయితే ఈ పాటలు అన్నీ మా దర్శకుడు సుజీత్ అభిరుచులకు, టేస్ట్ కి తగ్గట్టు గా నే ఉన్నాయి.” అని భూషణ్ కుమార్ తెలిపాడు. భూషణ్ కుమార్ తీ సిరీస్ కి హెడ్ గా ఉన్నారు.ఆయన సినిమా ఆడియో రైట్స్ మరియు థియేట్రికల్ రైట్స్ కొన్నారు.

అందుకే ఈ సినిమా కి పాటలు ఎంత తెలుగు లో రాయించిన బాలీవుడ్ ఫ్లేవర్ తో మాత్రమే వినిపిస్తున్నాయి. ఇక పాటలు వినడానికి బాలేదు కానీ విజువల్ గా చూడటానికి బాగుంటాయి అని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. దీని పై మరింత సమాచారం త్వరలో తెలుసుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -