- Advertisement -

హీరో ఎవరన్నది కన్ఫమ్ కాలేదు!

- Advertisement -

టాలీవుడ్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ దర్శకుడు తన మాటలతో జనాలను మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అందుకే టాలీవుడ్‍లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. సో ఈ దర్శకుడితో సినిమా చేయాలి అని ప్రతి ఒక్క హీరో ఎదురు చూస్తుంటాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తీసిన ‘అ..ఆ’ జూన్ 2న గ్రాండ్‍గా రిలీజ్‍కు రెడి అయింది. ఈ సినిమా తర్వాత మరి త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంపై ఇండస్ట్రీలో చర్చలు కొనసాగుతున్నాయి.

త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం పవన్ కళ్యాణ్‌తోనే చేస్తాడని టాక్ నడుస్తోంది. ‘అత్తారింటికి దారేది’తో పవన్‌కి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన త్రివిక్రమ్.. ఆ తరహా మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని అతడే ఇప్పించగలడని అనుకుంటున్నారు. పైగా.. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో వీరి కాంబోలో త్వరలోనే ఓ మూవీ సెట్స్ మీదకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది. గతంలో మహేష్‌తో ఓ మూవీ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ.. మురుగదాస్‌తోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ వుంటుందని మహేష్ చెప్పడంతో ఆ రూమర్‌కి చెక్ పడింది. ఆమధ్య బన్నీతోనూ ఓ సినిమాకి త్రివిక్రమ్ స్కెచ్ గీస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పటికీ ఈ రూమర్ వినిపిస్తూనే వుంది. అయితే.. బన్నీ నెక్ట్స్ మూవీ లింగుస్వామి దర్శకత్వంలో వుంటుందని చెప్పుకుంటున్నారు. ఇలా త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై రకరకాల గాసిప్స్ వస్తున్నాయి కానీ.. హీరో ఎవరన్నది కన్ఫమ్ కాలేదు.

అయితే.. త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో వుండబోతుందన్న దానిపై నిర్మాత రాధాకృష్ణ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘‘త్రివిక్రమ్ తెరకెక్కించే తదుపరి చిత్రానికి నేనే ప్రొడ్యూసర్‌ని. ఇప్పటివరకు పవన్‌కి ఒక కథ చెప్పాం. ఆయన ఓకె అంటారా లేదా అనేది ఇంకా తెలియదు. పవన్ ఓకే అంటే.. ఆయనతోనే సినిమా తెరకెక్కిస్తాం. కానీ.. నాకు మాత్రం బన్నీతో సినిమా చేయాలని వుంది. మరి.. త్రివిక్రమ్ ఎవరితో తీస్తారో వేచి చూడాలి’’ అంటూ చెప్పుకొచ్చారు. అంటే.. ఒప్పుకుంటే పవన్ లేదా బన్నీతో త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ వుంటుందన్నమాట. ఫైనల్‌గా ఎవరు సెట్ అవుతారో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -