Sunday, May 19, 2024
- Advertisement -

సాయి ధ‌ర‌మ్ తేజ్ ఫ్యూచ‌ర్ ఎటువైపు?

- Advertisement -

మెగ మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైన సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు ఆ ట్యాగ్‌తో వ‌రస ఆఫ‌ర్లు రాబ‌ట్టుకున్నాడు. అయితే సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక రేసులో వెన‌క‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న తాజాగా న‌టించిన చిత్రం తేజ్ ఐ లవ్య్వూతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా కూడా ఫెయిల్ కావ‌డంతో తేజ్‌ ఫ్యూచ‌ర్ ఏంటో తెలియాలి. ఈ సినిమా ఫ‌లితం తేజ్ కెరీర్‌పై పడుతుంద‌ని అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

తేజు ఫ‌స్ట్ నుండి క‌థ‌ల‌ను కాకుండా ద‌ర్శ‌కుల‌ను న‌మ్మి సినిమాలు చేస్తున్నాడు వాటిలో ఏదో ఒక‌టి ల‌క్‌లో ఆడిన సినిమాలు ఉన్నాయి. ఇక తేజ్ ఐ ల‌వ్య్వూ సినిమా ఏం చూసి సినిమాను ఒప్పుకున్నాడో అర్థం కావ‌డం లేదు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. తీసిన విధానం కూడా పాత‌దే. మ‌రి ఈ సినిమా ఎలా హిట్ అవుతుంద‌నే అనుకున్నాడో తెలియ‌డం లేదు. మాస్ సినిమాలు చేసిన క‌లిసి కాలేదు. దీంతో ప్రేమ క‌థ‌ల వైపు మ‌ళ్లిన ప్లాప్‌నే ముట్ట‌గ‌ట్టుకున్నాడు. ఇక మీద‌నైన సాయి ధ‌ర‌మ్ తేజ్ ద‌ర్శ‌కుల‌ను కాకుండా క‌థ‌ల‌ను న‌మ్మి సినిమాలు తీస్తే బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -