Friday, May 17, 2024
- Advertisement -

‘ఇంటెలిజెంట్‌` విడుద‌ల తేదీ ఖ‌రారు

- Advertisement -

మెగా అల్లుడు, న‌టుడు సాయిధరమ్‌ తేజ్ న‌టించిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమా విడుద‌ల తేదీ ఖార‌ర‌య్యింది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఉన్న సాయి ఈసారి విజ‌యం సాధించాల‌ని వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో సి క‌ల్యాణ్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై సాయిధ‌ర‌మ్‌తేజ్ బాగా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పబ్‌ సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈనెల 21వ తేదీతో ఈ పాట షూటింగ్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. మిగతా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు.
ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మ్యూజిక్ ఎస్ఎస్‌ థమన్ అందిస్తుండ‌గా, సహ నిర్మాతలుగా సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కల్యాణ్ వ‌హిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -