Sunday, May 5, 2024
- Advertisement -

మ‌రో విభిన్న పాత్ర‌లో న‌ట‌సింహాం

- Advertisement -

పౌరాణిక, చారిత్ర‌క సినిమాల్లో న‌టించి మెప్పించిన న‌టులు నందమూరి తార‌క రామారావు. పౌరాణిక‌, చారిత్ర‌క‌, సాంఘిక సినిమాలు చేస్తూ అచంచ‌ల ప్ర‌జాభిమానాన్ని పొందిన తెలుగు న‌టుడు ఎన్టీఆర్‌. అత‌డి వార‌స‌త్వం పుణికిపుచ్చుకొని తాను తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా స్వ‌యంగా చెప్పుకుంటూ నందమూరి బాల‌కృష్ణ వెళ్తున్నాడు. తండ్రి మాదిరి తాను కూడా చారిత్ర‌క‌, పౌరాణిక సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్ప‌టికే బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయ, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి పాత్రల్లో క‌నిపించారు. తాజాగా మ‌రో స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించడానికి అంగీక‌రించార‌ని తెలుస్తోంది.

ఇదే తరహాలో హిందూ వేదాంతి ‘రామానుజాచార్య’ పాత్రలో నటించనున్నట్లు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌క‌టించారు. ప్రస్తుతం బాల‌కృష్ణ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో త‌న తండ్రి ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాతో మ‌రికొన్ని సినిమాల‌తో బిజీగా ఉన్న ఆయన కొన్నేళ్ల తర్వాత ‘రామానుజాచార్య’ సినిమాను చేస్తానని తెలిపారు. గొప్ప వ్యక్తుల పాత్రలను చేయడమంటే మొదటి నుంచి తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -