Tuesday, April 30, 2024
- Advertisement -

షార్జా:పాక్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం అంధుల క్రికెట్ వ‌రల్గ్‌క‌ప్ మ‌న‌దే….

- Advertisement -

అంధుల వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాక్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. సౌతాఫ్రికాతో భార‌త జ‌ట్టు ఘోరంగా ఓడిపోతే షార్జాలో జ‌రిగిన అంధుల వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్ పాక్‌ను చిత్తు చేసింది. అంధుల క్రికెట్ ఫైనల్లో పాకిస్థాన్ పై రెండు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. అంధుల ప్రపంచ కప్ క్రికెట్ కప్ లో భారత్ రెండో సారి విజేతగా నిలిచింది.

తొలుత టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బ్యాట్స్‌మన్‌కు సహకరించడంతో పాక్‌ ఆటగాళ్లు చెలరేగిఆడారు. నిర్ణీత 40 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేశారు. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా …ధాటిగా అడుతూ మరో 10 బంతులు మిగలి ఉండగానే 309 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మొత్తంగా రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 600 పైచిలుకు పరుగులు నమోదు కావడం మరో రాకార్డు. ప్రపంచకప్‌ గెల్చుకున్న భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్యర్థి బౌలర్లను చితగ్గొడుతూ, కొండంత లక్ష్యాన్ని ధీమాగా పిండిచేసిన టీమిండియా.. వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 2014లో తొలిసారి అంధుల ప్రపంచకప్‌ను గెల్చుకున్న భారత్‌ ఇప్పుడు రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 1998 నుంచి జరుగుతోన్న ఈ పోటీల్లో భారత్‌, పాక్‌లు చెరో రెండుసార్లు, సౌతాఫ్రికా ఒకసారి విజేతలుగా నిలిచాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -