జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగా హీరోలు మద్దతు రోజు రోజుకి పెరుగిపోతుంది.ఇప్పటికే మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాబాయ్ పిలిస్తే ప్రచారానికి నేను రెడీ అంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.ఇప్పుడు మరో మెగా హీరో జనసేనానికి మద్దతు తెలిపారు.ఆయనే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. వచ్చే ఎన్నికల్లో తాను జనసేన తరుపున ప్రచారానికి రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చేశారు సాయి ధరమ్ తేజ్.
రాజమహేంద్రవరంకు హీరోయిన్ కేథరిన్‌తో కలిసి ‘కేఎల్‌ఎమ్’ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సాయిధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ .. పవన్‌కి సపోర్ట్ చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. నో డౌట్.. పవన్ మామ ఆర్డర్ వేస్తే చాలు అమలు చేసేందుకు మేమంతా ఎప్పుడూ రెడీగా ఉంటాము అని తెలిపారు.కాని పవన్ మాత్రం కుటుంబ సభ్యులను ఎవరిని పార్టీలోకి తీసుకోకూడదని అనుకుంటున్నరని తెలుస్తుంది.
కుటుంబ సభ్యులు వస్తు జనసేన మరో ప్రజారాజ్యంలా అవుతుందని ,అన్ని పార్టీలలాగే ఇది కూడా కుటుంబ పార్టీ అవుతుందని పవన్ భావిస్తున్నారు.మెగా కుటుంబం వస్తే పార్టీ డ్యామేజ్ అవుతుందని పవన్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారని సమాచారం.
