Saturday, April 20, 2024
- Advertisement -

ఒక‌ప్పుడు వ‌రుణ్‌తేజ్ ఎలా ఉన్నాడో చూడండి

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన న‌టుడు వరుణ్‌ తేజ్. ముకుందా సినిమాతో అరంగేట్రంలోనే క్లాసిక్ హిట్ అందుకున్న వ‌రుణ్ ఆ త‌ర్వాత కంచె, లోఫ‌ర్దూ, మిస్ట‌ర్‌, ఫిదా సినిమాల‌తో మంచి విజ‌యాలు అందుకున్నాడు. ప్ర‌స్తుతం మంచి సినిమాల‌తో దూసుకుపోతున్నారు. సినిమాల కోసం కష్టపడుతూ వ‌రుస సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్ స‌న్న‌గా ఉంటూ యువ‌త‌ను, అమ్మాయిల‌ను ఆక‌ట్టుకున్నాడు. అయితే ఒక‌ప్ప‌టి వ‌రుణ్‌తేజ్‌ను చూస్తే అంద‌రూ షాక‌వ్వాల్సిందే. శుక్ర‌వారం (జ‌న‌వ‌రి 19) వ‌రుణ్‌తేజ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అత‌డి క‌జిన్‌, మెగా న‌టుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ ఓ ఫొటోను అత‌డి బ‌ర్త్ డే సంద‌ర్భంగా బ‌హిర్గ‌త‌ప‌రిచాడు.

ఈ ఇద్దరూ ఒకప్పుడు ఎలా ఉండేవారో ట్విట్ట‌ర్‌లో ద్వార బ‌య‌ట‌పెట్టాడు. సాయి ధరమ్‌ తేజ్‌, వ‌రుణ్‌తేజ్ ఇద్ద‌రూ క‌లిసి థియేట‌ర్‌లో ఓ సినిమా చూస్తూ ఉండిపోయారు. సాయి వరుణ్‌తేజ్‌కు విషెస్‌ చెబుతూ సాయిధ‌ర‌మ్ తేజ్ ఓ ఫొటో పెట్టి వాటే చేంజ్ మావా అని ట్యాగ్ చేసి పెట్టాడు. సినిమాల్లోకి రాకముందు వీరిద్దరూ విపరీతమైన లావుగా ఉన్నారు. ఆపై వీరిద్దరు సినిమాల్లోకి రావ‌డంతో బ‌క్క‌చిక్కి క‌నిపిస్తున్నారు. వీరిద్ద‌రి కుటుంబ‌స‌భ్యులే అయినా స్నేహితుల మాదిరిగా మెలుగుతుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -