జెమినీ గ‌ణేశన్ పాత్ర పోషించిందెవ‌రో తెలుసా?

- Advertisement -
  • మ‌హాన‌టి షూటింగ్ పూర్తి

అల‌నాటి అందాల భ‌రిణె, తెలుగుద‌నానికి నిండుత‌నం సావిత్రి. అందుకే ఆమెను మ‌హాన‌టిగా పేర్కొంటారు. ఆ పేరుపైన నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జీవిత చ‌రిత్ర‌పై సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో, కీర్తి సురేశ్ సావిత్రి పాత్ర‌లో మ‌రికొంద‌రు ఇత‌ర పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే నిజ జీవితంలో సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌ను పోషించింది మ‌ల‌యాల న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ పోషిస్తున్నాడు. అచ్చం జెమినీ గ‌ణేశ‌న్ మాదిరి ఈ సినిమాలో క‌నిపిస్తున్నాడు. అత‌డికి సంబంధించిన చిత్రాలు బ‌య‌ట‌కు విడుద‌ల‌య్యాయి.

డిట్టో గ‌ణేశ‌న్ మాదిరి దుల్క‌ర్ క‌నిపించ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. దుల్క‌ర్ న‌ట‌న స‌హ‌జంగా ఉంటుంది. అత‌డికి తెలుగులో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది. ఇంకా మ‌హాన‌టి సినిమాలో అర్జున్‌రెడ్డి న‌టీన‌టులు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, శాలినీ పాండేతో పాటు ప్ర‌కాశ్ రాజ్‌, మాళ‌విక నాయ‌ర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాను వైజ‌యంతి మూవీసి బ్యాన‌ర్‌లో అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నాడు. సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళంలో మార్చి 29వ తేదీన విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -