Monday, May 6, 2024
- Advertisement -

అండ‌ర్ 19 వ‌రల్డ్‌క‌ప్‌లో యువ భార‌త్ జోరు….

- Advertisement -

అండర్-19 ప్రపంచ కప్‌లో యువ‌భార‌త జ‌ట్టు విజ‌యాల్లో దూసుకుపోతోంది. ప్పటికే వరుస రెండు విజయాలతో క్వార్టర్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్‌..తాజాగా జింబాబ్వేతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. తొలుత జింబాబ్వేను 154 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌ జట్టు..ఆపై 21.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి సత్తాచాటింది. దాంతో హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత యువ జట్టు గ్రూప్‌-బిలో టాప్‌ ప్లేస్‌కు చేరింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జింబాబ్వే ముందుగా బ్యాటింగ్‌ చేసి 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మధవారే(30), షుంబా(36), నికోలస్‌ రోచ్‌(31)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, మిగతా బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా నిరాశపరిచారు. భారత స్పిన్నర్‌ అనుకుల్‌ రాయ్‌ నాలుగు వికెట్లు సాధించగా, అభిషేక్‌ శర్మ, అర్షదీప్‌ సింగ్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

అటు తరువాత సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత జట్టు వికెట్‌ నష్టపోకుండా విజయం సాధించింది. హార్విక్ దేశాయ్ (73 బంతుల్లో 56 నాటౌట్: 8×4, 1×6), శుభమ్ గిల్ (59 బంతుల్లో 90 నాటౌట్: 13×4, 1×6) రాణించడంతో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దూకుడుగా ఆడిన శుభమ్ గిల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 100 ప‌రుగుల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియా‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం జింబాంబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత జట్టు పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా అండర్-19 వరల్డ్ కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పది వికెట్ల తేడాతో నెగ్గిన రెండో జట్టుగా రికార్డ్ నెలకొల్పింది. గ్రూప్‌-బిలో ఉన్న భారత్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌. పొరుగుదేశం బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -