Friday, May 10, 2024
- Advertisement -

డిసెంబ‌ర్ 1న జ‌వాన్‌గా రానున్న సాయిధ‌ర‌మ్‌తేజ్‌

- Advertisement -

మెగా ఫ్యామిలీ అల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన సినిమా జ‌వాన్‌. ఈ సినిమా ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. వ‌రుస ఆల‌స్య‌మ‌వుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వ‌చ్చే నెల 1వ తేదీన విడుద‌ల కావ‌డానికి సిద్ధంగా ఉంది. బీవీఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో తేజ్ స‌ర‌స‌న మెహ్రీన్ న‌టిస్తోంది. ప్ర‌తి నాయ‌క పాత్ర‌లో హీరోయిన్ స్నేహా భ‌ర్త ప్ర‌స‌న్న న‌టిస్తున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తోంది. ఈ ట్రైల‌ర్‌ను చూద్దాం. చాలా కాలం త‌ర్వాత థియేట‌ర్ల‌ను ఓ పెద్ద హీరో సినిమా ప‌ల‌క‌రించ‌నుంది.

మొద‌ట కొంచెం కామెడీ, రొమాంటిక్‌గా ప్రారంభ‌మైన ఈ సినిమా ట్రైల‌ర్ త‌ర్వాత‌త‌ర్వాత యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో ముగుస్తుంది. యుద్ధం మొద‌ల‌య్యాక ప‌క్కోడు పోయాడా.. వెన‌కోడు ఆగిపోయాడ‌.. ముందోడు కూలిపోయాడా కాదురా యుద్ధం గెలిచామా లేదా అన్న‌ది ముఖ్యం అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన యాక్ష‌న్స్ దృశ్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఒక ప్రక్కన తనకు నచ్చిందేదో దొరకలేదని ఇంకా వెతుక్కునే హీరో. మరో ప్రక్కన దేశసేనలకు చెందాల్సిన మిసైల్ సిస్టమ్ ను ముందుగా తను కొట్టేయాలని అనుకునే ఒక వ్యాపార‌వేత్త‌. విల‌న్లను ఆపడానికి ఒక సాధారణ వ్యక్తి కూడా జవాన్ మాదిరిగా చేసే యుద్దమే ఈ సినిమాగా తెలుస్తోంది. ఒక మాదిరి ధృవ‌, గ‌రుడ‌వేగ సినిమాగా క‌నిపిస్తోంది. అయితే ఈసారి తేజ్ విజ‌యం కోసం చాలా ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=PPyIVFUtc2Y

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -