Sunday, May 19, 2024
- Advertisement -

ఈ సినిమా కూడా క‌ష్ట‌మేనా తేజు?

- Advertisement -

సాయి ధ‌ర‌మ్ తేజ్.. మెగా మేన‌ల్లుడుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైన‌, త‌క్కువ కాలంలోనే త‌న‌కుంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మొద‌టి సినిమా రేయ్ ఫెయిల్ అయినప్ప‌టికి పిల్లా నువ్వు లేని జీవితంతో మంచి హిట్ కొట్టాడు. ఇక వ‌రసగా సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్ సినిమాలతో హిట్ కొట్టాడు. చిరంజీవి మేన‌రిజ‌మ్స్ సాయి ధ‌ర‌మ్‌లో క‌నిపించ‌డంతో అంద‌రు ఇత‌ను ఓ పెద్ద స్టార్ అవుతాడ‌నే అనుకున్నారు. కాని సీన్ రివ‌ర్స్ అయింది. వ‌చ్చిన సినిమాలు వ‌చ్చిన‌ట్లు ఫెయిల్ అయ్యాయి. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన సంగ‌తి కూడా ఎవ‌రికి తెలియ‌దు. పెద్ద ద‌ర్శ‌కులు కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు హిట్ ఇవ్వ‌లేకపోయారు.

సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరు సినిమాలు వ‌రస‌గా ఫెయిల్ అయ్యాయంటే అత‌ని ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. సాయి ధ‌ర‌మ్ తేజ్ తేజ్ ఐ ల‌వ్ యు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ ట్రైల‌ర్‌లో కొత్త‌ద‌నం లేద‌ని ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ లుక్ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రసగా మాస్ సినిమాలు చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్ ఒక్కేసారి సాఫ్ట్ లుక్‌లో క‌నిపించాడు. మ‌రి ప్రేక్ష‌కులు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సినిమాలో కొత్తద‌నం లేదని ఈ ట్రైల‌ర్‌ను బ‌ట్టి అర్థం అవుతుంది. మ‌రి ఈ సినిమా అయిన తేజుకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. తేజు ఇప్ప‌టికైనా ద‌ర్శ‌కుల‌ను న‌మ్మి కాకుండా,క‌థ‌ల‌ను న‌మ్ముకుని సినిమాలు చేస్తే బాగుంటుంద‌ని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -