రెండు తెలుగు రాష్ట్రాలలో బయోపక్‌ల ట్రెండ్ నడుస్తుంది. మాజీ ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్,వైఎస్ఆర్ జీవిత కథలను సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కూడా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక మన పక్క రాష్ట్రం అయిన తమిళనాడులో కూడా మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత జీవిత కథను తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా జయలలిత బయోపిక్ మొదలైంది కూడా. ‘ది ఐరెన్ లేడీ’ అనే పేరుతో బయోపిక్ ని మొదలుపెట్టారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ కనిపించనుంది. అయితే తమిళంలో జయలలిత జీవిత కథపై మరో బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్ర ఎవరు చేస్తున్నారో ఇంకా కన్ఫామ్ కాలేదు కాని , జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు కోలివుడ్ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
జయలలిత జీవిత కథ అంటే ఖచ్చితంగా శశికళ పాత్ర ఉండాల్సిందే. మరి కెరీర్ ఉన్నత దశలో ఉన్న సాయి పల్లవి జయలలిత జీవితంలో విలన్‌గా మారిన శశికళ పాత్ర పోషిస్తుందా అనే అనుమానం అందరిలోను నెలకొంది.ఇటీవల సాయి పల్లవి నటించిన ‘పడి పడి లేచే మనసు’, ‘మారి2’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు ఈ సినిమాలు కూడా సాయిపల్లవికి నిరాశను మిగిల్చాయి.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!