Saturday, May 11, 2024
- Advertisement -

శ‌ర్వా, సాయిప‌ల్ల‌వి సినిమా పేరెంటో తెలుసా?

- Advertisement -

ఫిదా ఫేమ్ అమ్మ‌డు సాయిప‌ల్ల‌వి ఎంసీఏతో మంచి హిట్ అందుకున్న ఈ భామకు సినిమా అవ‌కాశాలు ప‌డి ప‌డి వ‌చ్చేస్తున్నాయి. అందులో భాగంగా శ‌ర్వానంద్‌తో ఓ సినిమాకు అగీక‌రించింది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఓ భిన్న‌మైన టైటిల్‌ను ఫిక్స్ చేశారంట‌. ‘అందాల రాక్షసి’ సినిమాతో తొలి విజ‌యం అందుకున్న హ‌ను ఆ త‌ర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో క్లాసిక్ హిట్ అందుకున్నారు.

ఈ రెండు సినిమాల‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించారు. ఇప్పుడో భిన్న‌మైన క‌థ‌తో శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌వితో హ‌ను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ ‘పడి పడి లేచే మనసు’ అంటూ టైటిల్‌ను ఈ సినిమా కోసం రిజిస్టర్ చేశారట. త్వరలోనే ఈ టైటిల్‌ను ప్రకటించే అవ‌కాశం ఉంది. శ‌ర్వా, సాయిప‌ల్ల‌విల స‌హ‌జ న‌ట‌న‌తో సినిమా సూప‌ర్‌హిట్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -