Sunday, May 5, 2024
- Advertisement -

సిఎం కుర్చీలో బాలకృష్ణ….. కవరింగులో ఫెయిల్ అయి బఫూన్ అయిన ఎజె

- Advertisement -

ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి పదవిని, పార్టీని లాక్కున్న చంద్రబాబు ఎప్పుడూ కూడా ఎవ్వరినీ నమ్మలేని స్థితిలో ఉంటాడు. తాను చేసిన వెన్నుపోటు రాజకీయం తన విషయంలో ఇంకెవరైనా చేస్తారేమో అన్న భయం. అందుకే ఎప్పుడూ కూడా టిడిపిలో నంబర్ 2 లీడర్ అంటూ ఎవరూ లేకుండా చూసుకుంటాడు. అలాగే తనకు తప్ప వేరొక నాయకుడు ఎవ్వరికీ ప్రాధాన్యత లేకుండా ఉండేలా జాగ్రత్తపడుతూ ఉంటాడు. బాబే అంతా కష్టపడుతున్నాడు. మంత్రుల్లో కానీ, అధికారుల్లో కానీ ఇంకెవరూ కష్టపడడం లేదు అన్న ప్రచారం చేయిస్తూ మిగతా అందరినీ అసమర్థులుగా చిత్రీకరిస్తూ ఉంటాడు. ఇక నందమూరి కుటుంబంలో రాజకీయ ఆసక్తి బాగా ఉన్న హరికృకష్ణను ఎఫ్పుడూ బ్యాక్‌డోర్‌లోనే ఉంచాడు. లోకేష్‌కి పోటీ అవుతాడన్న ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్‌ని కూడా పార్టీకి దూరం చేశాడు. సినిమాల్లో కూడా ఎన్టీఆర్‌ని తొక్కేయాలన్న ప్రయత్నాలు చేశారు కానీ ఎన్టీఆర్ నేలకు కొట్టిన బంతిలా ఎగసిపడి తన సామర్థ్యం నిరూపించుకుంటూ వరుస హిట్స్ కొట్టడంతో డీలా పడ్డారు. ఇక ఇఫ్పుడు బాలయ్యను కూడా 2019నాటికి లూప్‌లైన్‌లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే బాలయ్య మాత్రం ఏకంగా సిఎం కుర్చీలో కూర్చుని షాక్ ఇచ్చాడు. బాలయ్య అభిమానులందరికీ కూడా బాలయ్యను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశ. అసలైన ఎన్టీఆర్ వారసుడు బాలయ్యే అన్నది వాళ్ళ అభి్ప్రాయం. అలాగే ఎన్టీఆర్ కుటుంబంలో కూడా కళ్యాణ్ రామ్, తారకరత్నలాంటి వాళ్ళకు బాలయ్యను ముఖ్యమంత్రిగా చూడాలన్న అభిలాష ఉంది. అందుకే సిఎం కుర్చీలో బాలయ్య అన్న వార్త ఎక్కడ వైరల్ అవుతుందో అని దావోస్ నుంచే టెన్షన్ పడ్డారు. భజన పత్రిక ఎజెకి కవరింగ్ పనిని అప్పజెప్పారు. తీరా ఆ ప్రయత్నంలో ఎజె కామెడీ అయిపోవడంతో ఇప్పుడు నెటిజనులు ఆడుకుంటున్నారు. బాలయ్య కూర్చున్న కుర్చీ హ్యాండిల్, షేప్ అంతా కూడా చంద్రబాబు కూర్చున్న కుర్చీలానే ఉంది. ఇక సిఎం కుర్చీని పక్కకు జరిపి కూర్చున్నాడు అని చెప్తున్నవాళ్ళు…..ఆ జరిపిన కుర్చీ ఎక్కడుందో కూడా చూపించాలిగా? అయినా ఏ పదవీలేనప్పుడే లోకేష్ సిఎం స్థాయిలో సమీక్షలు చేసి హంగామా చేసినప్పుడు ఇవే పచ్చ మీడియా సంస్థలు……..‘ఆహా మా లోకేష్ బాబు……ఓహో మా లోకేష్ బాబు……’ అని ఆనందపడ్డాయిగా. మరి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న బాలయ్య అదే పని చేస్తే మాత్రం ఎందుకంత తత్తరపాటు?

ఇక సిఎం కుర్చీకి ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారని, అంతా కూడా ఒక కుటుంబ వ్యవహారంలో తయారైందని ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మాటల్లో మాత్రం నిజం ఉంది. రాజధాని నిర్మాణ శంకుస్థాపనలతో సహా అన్ని విషయాలు కూడా ఇప్పుడు బాబు కుటుంబ వ్యవహారాలు అన్నట్టుగా మారిపోవడం మాత్రం అత్యంత బాధాకరమైన విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -