Wednesday, May 15, 2024
- Advertisement -

పెళ్లి కూతురిగా మారిన సాయి ప‌ల్ల‌వి.. వ‌రుడు అత‌నేనా..?

- Advertisement -

సాయి ప‌ల్ల‌వి … డ్యాన్స‌ర్‌గా త‌న కెరీర్‌ను మొద‌లుపెట్టింది. ఈటీవీ ఛానెల్లో ప్ర‌సార‌మ‌య్యే ఢీ షోలో కూడా డ్యాన్సర్‌గా పాల్గోంది. మ‌ళ‌యాళ ప్రేమ‌మ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సాయి ప‌ల్ల‌వి. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు ఫిదా కాని వారు ఉండ‌రు. ప్రేమ‌మ్ సినిమా సూప‌ర్ హిట్ అయింది. దీంతో సాయిప‌ల్ల‌వికి వేరే భాష‌ల్లో కూడా అవ‌కాశాలు వ‌చ్చాయి. త‌రువాత తెలుగులో ఫిదా అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ కావ‌డంతో తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో త‌మిళ ఇండ‌స్ట్రీ కూడా సాయి ప‌ల్ల‌వికి పిలిచి మ‌రి అవ‌కాశాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే సాయి ప‌ల్ల‌వి పెళ్లిపై కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ ద‌ర్శ‌కుడు, హీరోయిన్ అమ‌లాపాల్ మాజీ భ‌ర్త విజ‌య్‌తో సాయి ప‌ల్ల‌వి ప్రేమ‌లో ఉంద‌ని, వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈవార్త‌ల‌ను సాయి ప‌ల్ల‌వితో పాటు అటు ద‌ర్శ‌కుడు విజ‌య్ కూడా ఖండించారు. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే సాయి ప‌ల్ల‌వి లేటెస్ట్ ఫోటో షూట్‌లో రెచ్చిపోయింది. అచ్చం పెళ్లి కూతురు గెట‌ప్‌లో ఉన్న డ్రెస్సింగ్‌తో ఓ ఫోటో షూట్ చేసింది సాయి ప‌ల్ల‌వి. ఇది చూసిన వారు ఎవ‌రైన సాయి ప‌ల్ల‌వి పెళ్లికి రెడీ అయింద‌నే అనుకుంటారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -