Friday, April 19, 2024
- Advertisement -

ఇక నుంచి టెస్టుల్లో టాస్ ఉండ‌దు.. క్రికెట్‌లో భారీ మార్పుల‌కు సిద్ద‌మైన ఐసీసీ….

- Advertisement -

క్రికెట్‌లో భారీ మార్పుల‌కు సిద్ద‌మైంది ఐసీసీ. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ప్రారంభమయ్యే ముందు కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు ఐసీసీ ట్విటర్ ద్వారా వెల్లడించింది. క్రికెట్‌లో ఎలాంటి మార్పులు తీసుకు రావాలో త‌మ అభిప్రాయాల‌ను అభిమానులు ముందు ఉంచింది. వీటిలో ఏ మార్పులు మీరు ఎక్కువగా కోరుకుంటున్నారంటూ చివరి ట్వీట్‌లో ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది. జులై 2019, జూన్ 2021 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ నుంచి ఈ మార్పులను ప్రవేశపెట్టనుంది. మార్పుల్లో భాగంగా వారి జెర్సీపై వారి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌ను ఉంచాలన్నది ఒక ప్రతిపాదన.

మార్పుల్లో మ‌రొక‌టి టాస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తీమ్యాచ్‌లో టాస్ ఉండేది. అయితే ఇక‌నుంచి టాస్‌కు గుడ్ బాయ్ చెప్ప‌నుంది. దీని వల్ల అభిమానులే ఎవరు మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాలన్నది ట్విటర్ పోల్ ద్వారా నిర్ణయించే అవకాశం దక్కనుంది.

ఇన్నాళ్లూ క్రికెట్‌లో కామెంటేటర్లు అంటే గ్రౌండ్ బయట ఏసీ రూముల్లో కూర్చొని కామెంట్రీ చెప్పేవారు. కానీ తాజాగా ఐసీసీ ప్రతిపాదన ప్రకారం వాళ్లు నేరుగా ఫీల్డ్‌లో అడుగుపెట్టవచ్చు. మ్యాచ్ జరుగుతుంటే.. స్లిప్ ఫీల్డర్ వెనకాల నిలబడి కామెంట్రీ ఇవ్వొచ్చు.

ఒకే బాల్‌కు రెండు వికెట్లు తీసే అవకాశం కల్పించనుంది. అంటే ఓ బాల్‌కు బ్యాట్స్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న తర్వాత అవతలి బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేసే వీలు కూడా కల్పించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.

డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో సాయంత్రం సెషన్‌లో బ్యాటింగ్ చేసే టీమ్‌కు రెట్టింపు పరుగులు ఇస్తే ఎలా ఉంటుందన్నది కూడా ఐసీసీ ఆలోచిస్తున్నది. అంటే ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12 అన్నమాట. ఈ లెక్కన ఒకే బంతికి 12 పరుగులు చేసే వీలు బ్యాట్స్‌మన్‌కు కలుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -