Saturday, April 27, 2024
- Advertisement -

’పుష్ప 2’ కీలక పాత్రలో సాయిపల్లవి..?

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ” పుష్ప పార్ట్ 2 ” . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సంవత్సరం వచ్చిన ” పుష్ప ” మూవీ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హిందీలో దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దాంతో ” పుష్ప పార్ట్ 2 ” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే లీక్ అవుతున్న కొన్ని వార్తలు మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ” పుష్ప ది రూల్ ” పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. దాంతో ముందుగా అనుకున్న కథను చాలా వరకు మార్పులు చేసి యాక్షన్ డోస్ ఇంకాస్త పెంచనున్నట్లు సమాచారం. ఈ మద్యనే షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట బాగా వినిపిస్తోంది. అదేమిటంటే ఈ సినిమాలో కీలక పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్ సీన్లలో సాయిపల్లవి నటించబోతున్నట్లు సమాచారం. ఇందు కోసం సాయిపల్లవి 10 రోజులు కాల్ షీట్స్ ఇచ్చారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -