Monday, April 29, 2024
- Advertisement -

లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు..

- Advertisement -

తెలంగాణలో ఈ మద్య డిల్లీ లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రధానంగా వినిపించింది. అలాగే ఈడీ నివేదికలలో కూడా కవిత పేరే హైలెట్ అయింది. ఈ లిక్కర్ స్కామ్ ను హైలెట్ చేస్తూ కే‌సి‌ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో మెయిన్ కవితనే అని, ఆమె కచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయమని తీవ్ర విమర్శలు గుప్పించింది కాషాయ పార్టీ.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 10 తేదీన ఢిల్లీకి రావాలని నోటీసుల్లో తెలిపింది. అయితే శరత్ రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి వంటి వారితో కలిసి కవిత ఈ లిక్కర్ వ్యాపారాన్ని సాగించైనట్లు ఈడీ తాజా చార్జ్ షీట్ లో పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే కవిత చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

అంతే కాదు తాను కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్రపిళ్లై ఒప్పుకున్నారని ఈడీ పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. అటు మార్చి 10 మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ లో దీక్ష చేపట్టాలనుకున్న కవిత కి అదే రోజు ఢిల్లీకి రావాలని నోటీసుల్లో ఇచ్చి ఈడీ షాక్ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -