Thursday, May 2, 2024
- Advertisement -

తెలంగాణ బీజేపీపై స్పై కెమెరా..

- Advertisement -

తెలంగాణ బీజేపీపై ఢీల్లీ స్పై కెమెరా పెట్టిందా ? ఇక్కడ జరిగిన పరినామాలు మళ్లీ ఢిల్లీ పెద్దలకు అందుతున్నాయా ? ఇక్కడి పరినామాలను బీజేపీ నేత అధిష్టానానికి పంపిస్తున్నారా ? నేతల మధ్య విభేదాలు పిన్‌ టూ పిన్‌ చేయడంతో.. తెలంగాణ పార్టీ ముఖ్య నేతలు కంగు తిన్నారా ? బన్సాల్‌ రిపోర్ట్‌ చూసి వారు నివ్వర పోయారా ? ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఢిల్లీ పెద్దలు కమళం నేతలను ఉన్న ఫలంగా హస్తినకు పిలుపించుకున్నారా ? శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ భవన్‌లో వినిపిస్తోన్న గుసగుసలు ఏంటి ?

తెలంగాణలో యూపీ తరహా విదానాలను అమలు చేయడానికి బీజేపీ అధిష్టానం పక్కాగా వ్యూహాలను అమలు చేస్తోంది. యూపీలో సక్సస్‌ ఫుల్‌గా రెండుసార్లు ప్రభుత్వాన్నిఏర్పాటు చేయడంలో చాలా కీలకంగా వ్యహరించిన సునీల్‌ బన్సాల్‌ను తెలంగాణకు పంపించడంతోనే ఇక్కడ ఆపరేషన్‌ను ప్రారంభించింది. అందుకే ఇక్కడి పార్టీ నేతలకు షెడ్యూల్‌ ప్రిపేర్‌ చేసి ఇస్తోన్న పార్టీ పెద్దలు.. వాళ్ల డైరెక్షన్‌లోనే పని చేయాలని ఆదేశించారట. సునీల్‌ బన్సాల్‌ పైకి సాఫ్ట్‌గా కన్పిస్తోన్నా ఆయన అంత సెన్సిటీమ్‌ పర్సన్‌ కాదని తెలంగాణ బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముందు వచ్చిన బన్సాల్.. రెండో కంటికి తెలయకుండా ఆపరేషన్‌ లోటస్ ప్రారంభించారట. మునుగోడు బైపోల్స్‌ ఓటమి భారి నుంచి తేరుకోవడానికి కమళ నేతలు కుస్తీ పడుతుంటే.. సునీల్‌ బన్సాల్‌ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారట. తెలంగాణలో బీజేపీ బలపడాలంటే ముందు పార్టీలో ఉన్న విభేదాలకు స్వస్తి పలకాలని భావించిన బన్సాల్‌.. ఇక్కడ ఏం జరుగుతోందో మినిట్‌ టు మినిట్‌ రిపోర్ట్‌ను హైకమాండ్‌కు పంపుతున్నారట. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల కమళం నేతలను ఢిల్లీకి పిలుపుంచుకొని తలంటినట్లు సమాచారం.

తెలంగాణ కమళం క్యాంపులో ముఖ్య నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయని, వీరి మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించకుండా టార్గెట్‌ను రీచ్‌ కావడం సాధ్యం కాదని బన్సాల్‌ తన రిపోర్టులో పేర్కొన్నారట. దీంతో అలర్టైన అమిత్‌ షా రాష్ట్ర నేతలను ఆగమేఘాల మీద ఢీల్లీకి పిలిపించి బన్సాల్‌ రిపోర్టును వారి ముందు వుంచి ఇందేటని వారిని అడిగినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా కామెంట్స్ చేస్తున్న కొందరు నేతలకు గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారట. పార్టీలో జరుగుతున్న పరినామాలు తెలియడం లేదని అనుకోవద్దని షా గట్టిగానే హెచ్చరించారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -