ప్రముఖ దర్శకుడు శివగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సకళ కళా వల్లభుడు’ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. శివరాత్రికి ముందు ఫిబ్రవరి 01న సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ‘సకళ కళా వల్లభుడు’ సినిమాలోని ఐటెమ్ సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌తో అదరగొడుతున్నాయి. ప్రధానంగా యువతను ఆకట్టుకునే అన్ని అంశాలూ తమ సినిమాలో ఉన్నాయని దర్శక నిర్మాతలు వెల్లడించారు.
కమర్షియల్ హిట్ కోసం ఇలాంటివి కోరి కోరి మరీ చేయించినట్టు దర్శకుడు వెల్లడించారు. పాటల రచయత గిరిధర్ తన కలానికి పదునుపెట్టి మరీ తెలంగాణ, ఉత్తరాంధ్ర పదజాలం జోడించి.. మరీ పాటలను రాశారు. ‘తిక్కరేగిన వంకరగాళ్లు…మట్టికొట్టిన పోకిరివీళ్లు…సకళ కళా వల్లభులు వీరేనయ్యా’…అంటూ సాగిన పాటలు, కామెడీ సీన్లు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘సకళ కళా వల్లభుడు’ను తెరకెక్కించినట్టు దర్శకుడు శివగణేశ్ చెప్పారు. ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ, సీనియర్ నటులు సుమన్, చిన్నా, జీవా, అపూర్వ, శృతి, ప్రభావతి, విశ్వ తదితరులు నటించారు.
చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం, గిరిధర్ అందించారు. కెమేరా సాయిచరణ్, గరుడవేగ ఫేం ఎడిటర్ ధర్మేంధ్ర, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శివగణేశ్. ఉత్తమ అభిరుచి గలిగిన నిర్మాతలు, యువ దర్శకుడు శివగణేష్ చేసిన మేజిక్.. ఈ ఏడాది సూపర్‌హిట్‌లలో ఒకటిగా నిలవబోతోందని ఇప్పటికే ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రంలో చేసిన హీరో సైతం మంచి ఈజ్‌తో చేసిన నృత్యాలు, కామెడీ సీన్లకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. ఫిబ్రవరి 01న థియేటర్లలో ఈ మాస్, క్లాస్ కలిపిన సకల కళా వల్లభుడు చిత్రం సకల కళలు ప్రదర్శించబోతోంది.
- కన్నతల్లే.. కూతురిని కొట్టి చంపి..!
- ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో సహజీవనం.. చివరకు..
- మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ!
- ‘ధురంధర్’పై పవర్‌స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రామ్ చరణ్ ‘పెద్ది’ ఊచకోత.. బిగ్గెస్ట్ రికార్డ్!
