Monday, May 6, 2024
- Advertisement -

మ‌హిళ చున్నీ లాగిన‌ క‌ర్నాట‌క మాజీ సీఎం ..

- Advertisement -

క‌ర్నాట‌క మాజీ సీఎం సిద్దారామ‌య్య మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఉందాగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఆయ‌న లిమిట్స్ క్రాస్ చేశారు. మ‌హిళ‌లు అని చూడ‌కుండా అనుచితంగా ప్రవర్తించ‌డ‌మే కాకుండా ఆమె చున్నీ లాగేసి దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో క‌న్న‌డ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. దీనికి సిద్ధరామయ్య హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మహిళ సమస్యలపై సిద్ధూని నిలదీసింది. స‌హ‌ణం కోల్పోయిన ఆయ‌న మ‌హిళ చేతిలోనుంచి మైక్‌ను లాక్కున్నారు. మైక్‌తో పాటె ఆమె చున్నీకూడా వ‌చ్చేసింది. ఆమె భుజంపై చేయిపెట్టి బలవంతంగా కూర్చోబెట్టారు. మెల్లగా మాట్లాడు అంటూ బెదిరించారు. సిద్ధరామయ్య ప్రవర్తనతో ఆ మహిళతో పాటు అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. సిద్ధూ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడే కాదు, గతంలో చాలా సందర్భాల్లోనూ ఇలాగే ప్రవర్తించి సిద్ధరామయ్య వివాదాల్లో చిక్కుకున్నారు.

ఒక వైపు ఏఐసీసీ అధ్యక్షుడు మహిళా స్త్రీ సాధికార‌త‌ గురించి మాట్లాడుతుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు విమ‌ర్శించాయి.ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆ రాష్ట్ర బీజేపీ సీరియ‌స్ అయ్యింది. కౌర‌వుల ప్ర‌భుత్వంలో సిద్ధ‌రామ‌య్య దుశ్యాస‌నుడిలా ప్ర‌వ‌ర్తించార‌ని విమ‌ర్శించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -