Sunday, May 19, 2024
- Advertisement -

జ‌న‌సేన బ‌లం ఆ జిల్లాల‌కే ప‌రిమితమా?

- Advertisement -

ఏపీకి నారా చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కంటే తానే బేట‌ర‌ని చెప్ప‌క‌నే చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి ప‌డింద‌ట‌. సీఎం కావాలంటే మొద‌ట మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలి. కానీ ఉన్న 175 స్థానాల్లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌ది తేల్చుకోలేక‌పోతున్నార‌ట జ‌న‌సేనాని. మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఉంటుందనే ఊహాగానాలున్నాయి. ఇప్పటికీ ఉన్నాయ‌నుకోండి. కానీ జ‌న‌సేన మాత్రం సొంతంగానే పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వైపు వెళితే జనసేనకు తేడా కొడుతుందని.. ప్ర‌జ‌లు త‌మ‌ను న‌మ్మే ప‌రిస్థితి ఉండ‌ద‌ని విశ్లేష‌ణ‌న‌లు వినిపిస్తుండ‌టంతో టీడీపీ వైపుకు అడుగులు వేయ‌బోతున్నారు.

జ‌న‌సేన ముందు నుంచి కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని పోతుంది. అయినా కానీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేంత కేపాసిటీ పవన్ కల్యాణ్ పార్టీకి లేదనేది ఓపెన్ సీక్రెట్‌. జ‌న‌సేన త‌ర‌పున ఎవరైనా నామినేష‌న్ వేసినావారి ఖ‌ర్చులు ప‌వ‌నే భ‌రించాల్సి వ‌స్తుంది. అందుకే ప‌వ‌న్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని సమాచారం. అందుకే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల మీదే పవన్ కల్యాణ్ దృష్టి పెట్టాడని స్పష్టం అవుతోంది.

గోదావరి జిల్లాల్లో త‌న సామాజిక వ‌ర్గ‌ ఓట్ల మీద పవన్‌కు చాలా ఆశలున్నాయి. కాపుల మీద ఆధారపడి రాజకీయం చేయడం లేదని పవన్ కల్యాణ్ చెబుతున్నా… ఆయ‌న ఆ ప్రాంతాల‌పైనే ఎక్క‌వ‌గా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. కాపులు-బలిజల జనాభా గట్టిగా ఉన్న చోట మాత్రమే.. జ‌న‌సేన‌ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -