ప్రముఖ సింగర్ గీతామాధురి పాడిన ఓ ఐటెమ్ సాంగ్ త్వరలో థియేటర్లలో సందడి చేయబోతోంది. సకళ కళ వల్లభుడు సినిమాలో గీతామాధురి పాడిన ఊర మాస్ సాంగ్ శివరాత్రికి సందడి చేయడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 01న విడుదల కాబోతోంది. ‘తిక్కరేగిన వంకరగాళ్లు…మట్టికొట్టిన పోకిరివీళ్లు…సకళ కళా వల్లభులు వీరేనయ్యా’…అంటూ సాగిన గీతామాధురి ఐటెమ్ సాంగ్ యూ ట్యూబ్ లో లక్షల వ్యూస్ తో ట్రెండింగ్ అవుతోంది. ఓ వైపు ఆ పాట మంచి ఆదరణ పొందుతుండగానే మరోవైపు ‘ఆంధ్ర తెలంగాణ అల్లుడే వీడు… హార్సులా దూకాడు.
నాటుగ స్వీటుగ అల్లరే వీడు… యమ హాటుగ ఉన్నాడు’…. అంటూ సాగే పాటను సైతం విడుదల చేశారు. ఇందులో బన్నీ ఫ్యాన్సును ఆకట్టుకునేలా కొన్నిచరణాలున్నాయి. చెయ్యేస్తే బ్లాక్ బస్టర్ బన్నీ బొమ్మేలే.. అనే చరణం బన్నీ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేలా వుంది. సకళ కళా వల్లభుడు సినిమా ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీని సింహ ఫిల్మ్స్, దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. యువ దర్శకుడు శివగణేశ్ దర్వకత్వం వహించారు. తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘సకళ కళా వల్లభుడు’ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు శివగణేశ్ చెప్పారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు యూత్ తో పాటు మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ, సీనియర్ నటులు సుమన్, చిన్నా, జీవా, అపూర్వ, శృతి, ప్రభావతి, విశ్వ తదితరులు నటించారు. చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం, గిరిధర్ అందించారు. కెమేరా సాయిచరణ్, గరుడవేగ ఫేం ఎడిటర్ ధర్మేంధ్ర, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన శివగణేశ్. ఈ శివరాత్రికి గీతామాధురి మాస్ గీతాలు.. ఆంధ్ర, తెలంగాణల్లో సందడి చేయనున్నాయి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’