Saturday, April 20, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ ‘లైగర్’ డేట్ ఫిక్స్!

- Advertisement -

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా కి లైగర్ అనే పేరు అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే నెలకొంటున్నాయి. వాస్తవానికి ఈ సినిమా లాక్ డౌన్ ముందు రావాల్సి ఉన్నా.. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. మొదట ఈ సినిమాకి ఫైటర్ అనే పేరు ఉంటుందని అందరూ భావించారు. కానీ లైగర్ అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. దానినే ఫైనల్ చేశారు.

ఇక లైగర్ అంటే పులికి సింహానికి క్రాస్ బ్రీడు. అంటే మగ సింహానికి ఆడపులికి పుట్టిన బిడ్డను లైగర్ అంటారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ నెల 9న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని విజయ్ దేవరకొండను చూడబోతున్నట్లు దర్శకులు పూరి జగన్నాధ్ చెబుతున్నారు.

ఈ సినిమాలో విజయ్‌ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.  పూరీ కనెక్ట్స్ – ధర్మ క్రియేషన్స్ సంయిక్తంగా తెరకెక్కిస్తున్నారు.

బ్రౌన్ రైస్ తో ఎంతో మంచి ఆరోగ్యం!

ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది : పవన్ కళ్యాన్

రెండో పెళ్ళి చేసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..!

త్వరలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -