Sunday, May 19, 2024
- Advertisement -

చెయ్యేస్తే బ్లాక్ బస్టర్ బన్నీ బొమ్మేలే..

- Advertisement -

వినాయక చవితి కానుకగా గీతామాధురి పాడిన ఓ ఐటెమ్ సాంగ్ విడుదల చేసిన సకళ కళ వల్లభుడు సినిమా టీం ఈ రోజు మరో ఊర మాస్ సాంగ్ రిలీజ్ చేసింది. ‘తిక్కరేగిన వంకరగాళ్లు…మట్టికొట్టిన పోకిరివీళ్లు…సకళ కళా వల్లభులు వీరేనయ్యా’…అంటూ సాగిన గీతామాధురి ఐటెమ్ సాంగ్ యూ ట్యూబ్ లో లక్షల వ్యూస్ తో ట్రెండింగ్ అవుతోంది. ఓ వైపు ఆ పాట మంచి ఆదరణ పొందుతుండగానే మరోవైపు నేడు ‘ఆంధ్ర తెలంగాణ అల్లుడే వీడు…హార్సుల దూకాడు. నాటుగ స్వీటుగ అల్లరే వీడు…యమ హాటుగ ఉన్నాడు’…. అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇందులో బన్నీ ఫ్యాన్సును ఆకట్టుకునేలా కొన్నిచరణాలున్నాయి. చెయ్యేస్తే బ్లాక్ బస్టర్ బన్నీ బొమ్మేలే..అనే చరణం బన్నీ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేలా వుంది. ‘సకళ కళా వల్లభుడు’ ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు ముస్తాబవుతోంది. ఈ మూవీని సింహ ఫిల్మ్స్, దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ దర్శకుడు శివగణేశ్ దర్వకత్వం వహిస్తున్నారు. తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త హీరో హీరోయిన్లకు పరిచయమవుతున్నారు.

గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘సకళ కళా వల్లభుడు’ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు శివగణేశ్ చెప్పారు. త్వరలో టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు యూత్ తో పాటు మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ, సీనియర్ నటులు సుమన్, చిన్నా, జీవా, అపూర్వ, శృతి, ప్రభావతి, విశ్వ తదితరులు నటించారు. చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం, గిరిధర్ అందించారు. కెమేరా సాయిచరణ్, గరుడవేగ ఫేం ఎడిటర్ ధర్మేంధ్ర, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన శివగణేశ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -