Thursday, May 2, 2024
- Advertisement -

సలార్ గ్లోబర్ రిలీజ్‌..అప్‌డేట్!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న సలార్‌ మూవీ కోసం ఫ్యాన్స్‌ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా డిసెంబర్ 1 నుండి ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేయనున్నారు.

ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ చిత్రం గ్లోబల్ రిలీజ్ కి సంబంధించి కీ అప్‌డేట్ వచ్చేసింది. ఓవర్సీస్ మార్కెట్ లో ప్రముఖ సంస్థ పార్స్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

రెండు పార్టులుగా విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ‘సలార్: సీజ్‌ఫైర్‌’ పేరుతో రానుంది. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా మూవీ ట్రైలర్‌ని డిసెంబర్‌ 1న విడుదల చేయనున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -